1998
Appearance
1998 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1995 1996 1997 1998 1999 2000 2001 |
దశాబ్దాలు: | 1970లు 1980లు 1990లు 2000లు 2010లు |
శతాబ్దాలు: | 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం - 21 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- జనవరి 1: యూరోపియన్ కేంద్రీయ బ్యాంకు స్థాపించబడింది.
- పిబ్రవరి 6: వాషింగ్టన్ జాతీయ విమానాశ్రయం పేరును రోనాల్డ్ రీగన్ జాతీయ విమానాశ్రయంగా మార్పుచేశారు.
- ఫిబ్రవరి 7: జపాన్ లోని నగోనాలో శీతాకాలపు ఒలింపిక్ క్రీడలు ప్రారంభమయ్యాయి.
- ఫిబ్రవరి 16: చైనాకు చెందిన విమానం నివాసప్రాంతాలపై కూలి 202 మంది మృతిచెందారు.
- మార్చి 19: భారత ప్రధానమంత్రిగా అటల్ బిహారీ వాజపేయి పదవిని చేపట్టినాడు.
- మార్చి 24: భారత లోక్‌సభ స్పీకర్‌గా జి.యమ్.సి.బాలయోగి పదవిని స్వీకరించాడు.
- మార్చి 27- ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ వారు వయాగ్రా మందును మగవారి నరాలబలహీనతకు ఔషదంగా ధ్రువీకరించారు.
- మే 11: రాజస్థాన్ లోని పోఖరాన్ ప్రాంతంలో భారతదేశం మూడు అణుపరీక్షలు నిర్వహించింది.
- మే 13: పోఖరాన్‌లో భారత్ మరో రెండు అణుపరీక్షలు జరిపింది.
- మే 28: భారత అణుపరీక్షలకు పోటీగా పాకిస్తాన్ ఐదు అణుపరీక్షలను బలూచిస్తాన్ లోని చాఘై ప్రాంతంలో నిర్వహించింది.
- జూన్ 10: ఫ్రాన్సులో ప్రపంచ కప్ సాకర్ పోటీలు ప్రారంభమయ్యాయి.
- జూన్ 12: ఫిలిప్పీన్స్ శతవార్షికోత్సవాన్ని జరుపుకొంది.
- జూన్ 25: మైక్రోసాఫ్ట్ సంస్థ విండోస్ 98 తొలి ఎడిషన్‌ను విడుదల చేసింది.
- జూన్ 30: ఫిలిప్పీన్స్ ఉపాద్యక్షుడు జోసెఫ్ ఎస్ట్రాడా 13వ అధ్యక్షుడిగా ప్రమాణస్వీకారం చేశాడు.
- జూలై 5: జపాన్ అంగారకుడి పైకి ప్రోబ్ ఉపగ్రహాన్ని పంపింది.
- జూలై 12: ఫ్రాన్సు 3-0 తేడాతో బ్రెజిల్‌ను ఓడించి ప్రపంచ కప్ సాకర్-98 గెలిచింది.
- డిసెంబర్ 6: 13వ ఆసియా క్రీడలు థాయిలాండ్ లోని బాంకాక్లో ప్రారంభమయ్యాయి.
జననాలు
[మార్చు]- మే 4 : కేసరి గిరీష్ కుమార్
- జూన్ 17: అంకిత భకత్, భారతీయ విలువిద్య క్రీడాకారిణి.
మరణాలు
[మార్చు]- జనవరి 15: గుల్జారీలాల్ నందా, పూర్వ తాత్కాలిక ప్రధానమంత్రి. (జ.1898)
- ఫిబ్రవరి 1: మార్గా ఫాల్స్టిచ్, జర్మన్ శాస్త్రవేత్త (జ.1915)
- ఫిబ్రవరి 22: రామణ్ లాంబా , భారతదేశపు మాజీ క్రికెట్ ఆటగాడు. (జ.1960)
- ఫిబ్రవరి 26: థియోడర్ షుల్జ్, ఆర్థికవేత్త, నోబెల్ బహులతి గ్రహీత.
- ఏప్రిల్ 10: విద్యా ప్రకాశానందగిరి స్వామి, ఆధ్యాత్మికవేత్త, శ్రీకాళహస్తిలోని శుక బ్రహ్మాశ్రమ స్థాపకులు, బహుభాషాకోవిదులు. (జ.1914)
- ఏప్రిల్ 28: రమాకాంత్ దేశాయ్, భారత మాజీ క్రికెట్ క్రీడాకారుడు. (జ.1939)
- మే 3: వెంకటేష్ కులకర్ణి, భారతీయ-అమెరికన్ నవలా రచయిత, విద్యావేత్త. (జ. 1945)
- జూన్ 4: ఆరుద్ర, కవి, గేయరచయిత, సాహితీవేత్త, కథకుడు, నవలారచయిత, విమర్శకుడు, పరిశోధకుడు, అనువాదకుడు. ( జ.1925)
- జూన్ 29: కమలాకర కామేశ్వరరావు, తెలుగు సినిమా దర్శకులు. (జ.1911)
- ఆగష్టు 8: లాస్లో జాబో, హంగరీకి చెందిన అంతర్జాతీయ చెస్ గ్రాండ్ మాస్టర్ (జ.1917)
- ఆగష్టు 18: ప్రొతిమా బేడి, ఒడిస్సీ సాంప్రదాయ భారతీయ నృత్య కళాకారిణి. (జ.1948)
- సెప్టెంబర్ 15: జే.రామేశ్వర్ రావు, వనపర్తి సంస్థానాధీశుడు, దౌత్యవేత్త, భారత పార్లమెంటు సభ్యుడు. (జ.1923)
- అక్టోబర్ర్ 7: హరి గోవిందరావు వర్తక్, మహారాష్ట్ర కు చెందిన సామాజిక కార్యకర్త, రాజకీయ నాయకుడు. పద్మశ్ర్రీ అవార్డు గ్రహీత. (జ.1914)
- అక్టోబరు 22: అజిత్ ఖాన్, హిందీ సినిమా నటుడు (జ. 1922)
- నవంబర్ 3: పి.ఎల్. నారాయణ, విలక్షణమైన నటులు, నటక ప్రయోక్త. (జ.1935)
- డిసెంబర్ 3: పసల అంజలక్ష్మి, గాంధేయ సిద్ధాంతాలతో జీవితాన్ని మలచుకుని, సమాజ సేవకై ఆస్తినంతా ఆనందంగా సమర్పించిన త్యాగమయి. (జ.1904)
- డిసెంబర్ 27: ధూళిపూడి ఆంజనేయులు, ఆంగ్ల రచయిత, సంపాదకులు. (జ.1924)
పురస్కారాలు
[మార్చు]- భారతరత్న పురస్కారం: ఎం.ఎస్.సుబ్బలక్ష్మి, సి.సుబ్రమణ్యం, జయప్రకాశ్ నారాయణ్
- దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు : బి.ఆర్.చోప్రా.
- జ్ఞానపీఠ పురస్కారం : గిరీష్ కర్నాడ్
నోబెల్ బహుమతులు
[మార్చు]- భౌతికశాస్త్రం: రాబర్ట్ లాఘ్లిన్, హొరస్ట్ స్టార్మర్, డేనియల్ చీ సూయ్.
- రసాయనశాస్త్రం: వాల్టర్ కోన్, జాన్ పాపుల్.
- వైద్యం: రాబర్ట్ ఫుర్చ్‌గాట్, లూయీస్ ఇగ్నారో, ఫెరిద్ మురాడ్.
- సాహిత్యం: జోస్ సరమాగో.
- శాంతి: జాన్ హ్యూమ్, డేవిడ్ ట్రింబుల్.
- ఆర్థికశాస్త్రం: అమర్త్యాసేన్.