1810
Appearance
1810 గ్రెగోరియన్ కాలెండరు యొక్క మామూలు సంవత్సరము.
సంవత్సరాలు: | 1807 1808 1809 - 1810 - 1811 1812 1813 |
దశాబ్దాలు: | 1790లు 1800లు - 1810లు - 1820లు 1830లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- ఏప్రిల్ 19: వెనెజులా స్పెయిన్ నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకుంది, స్పెయిన్ నుండి స్వాతంత్ర్యం పొందిన తొలి దక్షిణ అమెరికా దేశం అది.
- ఏప్రిల్ 27: లుడ్విగ్ వాన్ బీథోవెన్ తన ప్రసిద్ధ పియానో సంగీతం, ఫ్యూర్ ఎలిసేను స్వరపరచాడు.
- మే 10: రెవ. హెన్రీ డంకన్ మొట్టమొదటి సేవింగ్స్ బ్యాంకును, స్కాట్లండులో స్థాపించాడు..[1]
- జూలై 9: నెపోలియన్ హాలండు సామ్రాజ్యాన్నిఒ ఆక్రమించాడు
- జూలై 20: కొలంబియా దేశం స్పెయిన్ నుంచి స్వాతంత్ర్యం ప్రకటించుకొంది.
- సెప్టెంబరు 16: మెక్సికో స్వాతంత్ర్య యుద్ధం మొదలైంది.మిగ్యూల్ హిడాల్గో అనే కాథలిక్ పూజారి ప్రారంభించిన తిరుగుబాటు స్వాతంత్ర్య యుద్ధంగా రూపుదిద్దుకుంది.
- సెప్టెంబరు 18: చిలీలో తొలి జాతీయ కూటమి ఏర్పడింది. స్వాతంత్ర్య సముపార్జనలో తొలి అంగ అది
- సెప్టెంబరు 23: వెస్ట్ ఫ్లారిడా రిపబ్లిక్ స్పెయిన్ నుండి స్వాతంత్ర్యం ప్రకటించుకుంది
- అక్టోబరు 27: వెస్ట్ ఫ్లారిడా రిపబ్లిక్‌ను అమెరికా ఆక్రమించుకుంది
- అక్టోబరు: ఇంగ్లండు రాజు మూడవ జార్జి పిచ్చివాడని తేలింది
- నవంబరు 17: స్వీడన్ ఇంగ్లాండుపై యుద్ధం ప్రకటించింది
- డిసెంబరు 3: మారిషస్ ఫ్రాన్సు నుండి బ్రిటను అధీనం లోకి వెళ్ళింది.
- తేదీ తెలియదు: కోలిన్ మెకంజీ మద్రాసు సర్వేయర్ జనరల్‌గా నియమితుడయ్యాడు
- తేదీ తెలియదు: హోమియో వైద్యం పితామహుడు హానిమాన్ ఆర్గనాస్ ఆఫ్ రేషనల్ హీలింగ్ అనే గ్రంథాన్ని రచించాడు.
- తేదీ తెలియదు: కడప పట్టణం లోని షామీరియా దర్గా పక్కన ఉన్న మసీదును నిర్మించారు
- తేదీ తెలియదు: షేక్ డీన్ మహొమద్ లండన్‌లో తొలి భారతీయ రెస్టారెంటు, హిందూస్థానీ కాఫీ హౌస్ స్థాపించాడు.[2]
జననాలు
[మార్చు]మరణాలు
[మార్చు]- ఫిబ్రవరి 24: హెన్రీ కేవిండిష్, బ్రిటిష్ తత్వవేత్త, సైద్ధాంతిక రసాయన, భౌతిక శాస్త్రవేత్త. (జ.1731)
- తేదీ తెలియదు: మీర్ తఖి మీర్, ఉర్దూ కవి. (జ.1723)
పురస్కారాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Chronology of Scottish History". A Timeline of Scottish History. Rampant Scotland. Retrieved 2014-03-10.
- ↑ "Icons, a portrait of England 1800-1820". Archived from the original on October 17, 2007. Retrieved 2007-09-11.