1884
Appearance
1884 గ్రెగోరియన్ కాలెండరు యొక్క లీపు సంవత్సరము.
సంవత్సరాలు: | 1881 1882 1883 - 1884 - 1885 1886 1887 |
దశాబ్దాలు: | 1860లు 1870లు - 1880లు - 1890లు 1900లు |
శతాబ్దాలు: | 18 వ శతాబ్దం - 19 వ శతాబ్దం - 20 వ శతాబ్దం |
సంఘటనలు
[మార్చు]- ఫిబ్రవరి 5: హైదరాబాద్ 6వ నిజాం మహబూబ్ ఆలీ ఖాన్ పట్టాభిషేకం.
- ఫిబ్రవరి 12: లూయిస్ ఎడ్సన్ వాటర్మన్ ఆవిష్కరించిన ఫౌంటెన్ పెన్ పేటెంట్ పొందింది.
- మార్చి 3: ఫలక్నుమా ప్యాలెస్ భవన నిర్మాణం ప్రారంభం.
- ఆగష్టు 4:థామస్ స్టీవెన్స్ సైకిల్ మీద అమెరికా అంతా చుట్టివచ్చిన మొదటి మనిషి. ఆ తరువాత, అతడు, సైకిల్ మీద ప్రపంచమంతా, చుట్టివచ్చాడు.
తేదీ వివరాలు తెలియనివి
[మార్చు]- ఢిల్లీ - మథుర రైలు మార్గం ప్రారంభం[1]
- కలకత్తా - ఖుల్నా రైలు మార్గం ప్రారంభం
- భోపాల్ - ఇటార్సీ రైలు మార్గం ప్రారంభం
జననాలు
[మార్చు]- మార్చి 10: మహమ్మద్ మియా మన్సూర్ అన్సారీ, స్వాతంత్ర్య సమరయోధుడు. (మ.1946)
- ఏప్రిల్ 24: విస్సా అప్పారావు, భౌతికశాస్త్ర అధ్యాపకుడు, గ్రంథకర్త. (మ.1966)
- జూన్ 15: తారక్నాథ్ దాస్, బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడిన అంతర్జాతీయ విద్వాంసుడు. (మ.1958)
- సెప్టెంబర్ 5: కల్లోజు గోపాలకృష్ణమాచార్యులు, ఆంధ్ర విశ్వకర్మ వంశీయుడు.
- అక్టోబర్ 4: సుబ్రహ్మణ్య శివ, స్వాతంత్ర్య సమర యోధుడు, రచయిత. (మ.1925)
- నవంబర్ 8: హెర్మన్ రోషాక్, స్విడ్జర్లాండ్కు చెందిన మానసిక శాస్త్రవేత్త. (మ.1922)
- డిసెంబర్ 3: బాబూ రాజేంద్ర ప్రసాద్, మొదటి రాష్ట్రపతి. (మ.1963)
తేదీ వివరాలు తెలియనివి
[మార్చు]- బుర్రా శేషగిరిరావు, కళలు అనే సాహిత్యమాసపత్రికకు సంపాదకుడు. (మ.1941)
- నండూరి వెంకట సుబ్బారావు, ఎంకి పాటలు గేయ రచయిత. (మ.1957)
- వావిళ్ళ వెంకటేశ్వర శాస్త్రి, పండితుడు, భాషా పోషకుడు, శాస్త్రవేత్త. (మ.1956)
- చంద్రమౌళి చిదంబరరావు, అభ్యుదయ రచయితల సంఘ ప్రారంభకుల్లో ఒకడు.
- హరి నాగభూషణం, ఆంధ్ర గాయకుడు, వాగ్గేయకారుడు. (మ.1959)
- ఎం. సి. సేతల్వాద్, భారత అటార్నీ జనరల్. (మ.1974)
- సుఘ్రా హుమాయున్ మిర్జా, హైదరాబాదుకు చెందిన తొలితరం ఉర్దూ రచయిత్రి. (మ.1954)
- జయంతి గంగన్న, జానపద గేయ రచయిత, సినిమా నటుడు. (మ.1962)
- స్వామిబాబు పొట్నూరు, దేశభక్తుడు, దాత, సంఘసేవకుడు, కవి, పండితపోషకుడు. (మ.1982)
- కందుకూరి అంబికా వరప్రసాదరావు, రంగస్థల నటుడు, నాటక సమాజ నిర్వాహకుడు, న్యాయవాది. (మ.1964)
మరణాలు
[మార్చు]- జనవరి 6: గ్రెగర్ మెండల్, జన్యుశాస్త్రంలో జన్యు భావనను తొలిసారిగా ప్రపంచానికి తెలియజెప్పిన శాస్త్రవేత్త. (జ.1822)
- జనవరి 8: కేశవ చంద్ర సేన్, సంఘ సంస్కర్త (జ.1838)
- సెప్టెంబర్ 10: జార్జి బెంథామ్, బ్రిటిష్ వృక్ష శాస్త్రవేత్త. (జ.1800)
- డిసెంబర్ 12: చార్లెస్ ఫిలిప్ బ్రౌన్ (జ.1798).