హజ్
ఈ వ్యాసంలో మూలాలను ఇవ్వలేదు. |
హజ్ (అరబ్బీ : حج ) అంటే ముస్లింల పుణ్యక్షేత్రమైన మక్కా నగరానికి తీర్థయాత్ర చేయడం. ఇస్లాం ఐదు మూలస్థంభాలలో ఐదవది. ప్రతి ముస్లిం తన జీవితకాలంలో కనీసం ఒక్కసారైనా హజ్ యాత్ర చేయాలి. ఇస్లామీయ కేలండర్ లోని 1వ నెల జుల్-హజ్జ (బక్రీదు నెలలో) లో ఈకార్యం నిర్వహిస్తారు. హజ్ కు వెళ్ళినవారు మదీనా (మహమ్మదు ప్రవక్త సమాధి గల నగరం) తప్పక దర్శిస్తారు. హజ్ కు వెళ్ళివచ్చిన వారికి స్వాగతమివ్వడం పుణ్యదాయకమని తలుస్తారు.
చరిత్ర
[మార్చు]పూర్వకాలంలో హజ్ యాత్ర అనేక వ్యయ ప్రయాసలతో కూదుకొని ఉండేది. మక్కా చేరడానికి సుదీర్ఘ ఓడ ప్రయాణం చేసిన తర్వాత రోడ్డు మార్గంలో, ఎడారిలో ఒంటెలపై ప్రయాణించవలసి వచ్చేది. మక్కాలో గుడారాలలో బస చేసేవారు. ప్రస్తుతము ప్రపంచవ్యాప్తంగా మక్కా నగరానికి విమాన సౌకర్యాలు ఉన్నాయి. అలాగే వ్యక్తుల ఆర్థిక స్తోమతను బట్టి బస చేయడానికి వివిధ వసతి గృహాలు ఉన్నాయి.
మహమ్మద్ ప్రవక్త కాలంనుండి
[మార్చు]హజ్ ఎవరు చేయకూడదు?
[మార్చు]- అప్పులున్నవాడు
- వడ్డీలు, సబ్సిడీలు, దానధర్మాల డబ్బుతో యాత్ర చేయదలచినవాడు.
- కుటుంబ బాధ్యతలు పూర్తిగాతీర్చనివాడు.
- తనపై ఆధారపడిన బిడ్డలు, పెళ్ళికాని కూతురు ఉన్నవాడు.
- రోగపీడితుడు.
హజ్ ఎలా చేయాలి
[మార్చు]తల్బియా
[మార్చు]హజ్ యాత్రికులు. "లబ్బైక అల్లాహుమ్మ లబ్బైక్ . " ఓ దేవా, నేను నీ సేవలో ఇక్కడ ఉన్నాను. నీకు భాగస్వాములు లేరు. సర్వ స్తోత్రాలు నీవే. సకల రాజ్యమూ కృపా నీదే. హజ్ చేయమని మీరిచ్చిన పిలుపుకు విధేయుడనై హాజరయ్యాను" అంటూ చేసే ప్రార్థన.
భారతదేశంలో హజ్ యాత్ర నియంత్రణ
[మార్చు]హజ్ యాత్రకు ఇస్తున్న సబ్సిడీని రద్దు చేయాలని, సబ్సిడీ బదులు తక్కువ చార్జీలతో, యాత్రికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేలా విమానయాన సంస్థలతో దీర్ఘకాలిక ఏర్పాట్లు చేసుకోవాలని, సౌదీ వెళ్లే హజ్ యాత్రికులకు అక్కడ మెరుగైన వసతి సౌకర్యాలు కల్పించాలని పలువురు ముస్లిం ఎంపీలు డిమాండ్ చేశారు.భిక్షంలాంటి సబ్సిడీ తమకు వద్దని, సబ్సిడీని ఉపసంహరించుకునేలా దీర్ఘకాలిక విధానాన్ని రూపొందించాలని, సబ్సిడీ వల్ల యాత్రికుల కంటే దళారులే ఎక్కువగా లబ్ధి పొందుతున్నారని బీజేపీ సభ్యుడు షానవాజ్ హుస్సేన్ కోరారు. (సూర్య 8.3.2011)
ఆంధ్రప్రదేశ్ లో హజ్ యాత్ర నియంత్రణ
[మార్చు]- ఆంధ్రప్రదేశ్ హజ్ సంఘం [1]
- సెక్రటరి, ఆంధ్రప్రదేశ్ స్టేట్ హజ్ కమిటి, హైదరాబాదు. [2]
ఇవీ చూడండి
[మార్చు]ఇబ్రాహీం (Ibrāhīm - إبراهيم) |
---|