జూలై 2008
Appearance
వర్తమాన ఘటనలు | 2008 ఘటనలు నెలవారీగా - | జనవరి | ఫిబ్రవరి | మార్చి | ఏప్రిల్ | మే | జూన్ | జూలై | ఆగష్టు | సెప్టెంబరు | అక్టోబరు | నవంబరు | డిసెంబరు | వికీపీడియా ఘటనలు | 2007 ఘటనలు |
జూలై 1
[మార్చు]- ఆర్కిటిక్ ప్రాంతంలో భారత్ హిమాద్రి పేరుతో మొట్టమొదటి పరిశోధన కేమ్ద్రాన్ని ప్రారంభించింది.
- జమ్ము కాశ్మీర్ ప్రభుత్వం అమర్నాథ్ ఆలయమండలికి 39.88 హెక్టార్ల స్థలాన్ని కేటాయిస్తూ జారీచేసిన ఉత్తర్వును వెనక్కి తీసుకుంది.
- ఉత్తర అఫ్ఘనిస్తాన్‌లో అమెరికా దళాలు చేపట్టిన దాడుల్లో 33 తీవ్రవాదులు మృతిచెందారు.
- పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు నగర మేయర్‌గా కాంగ్రెస్ పార్టీకి చెందిన తాడిగడప రామారావు ఎన్నికయ్యాడు.
- వైద్యరంగంలో విశేషకృషి చేసినవారికిచ్చే బి.సి.రాయ్ జాతీయ అవార్డులను 54మంది వైద్యులకు రాష్ట్రపతి ప్రతిభా పాటిల్ అందజేసింది.
- ప్రముఖ బాలివుడ్ నటి శిల్పాషెట్టి బ్రిటన్ ప్రధానంచేసే ప్రతిష్ఠాత్మక గ్లోబల్ డైవర్సిటీ అవార్డుకు ఎన్నికైంది.
జూలై 2
[మార్చు]- ఈశాన్య రాష్ట్రాల అభివృద్ధికై అన్ని రాష్ట్రాల రాజధానులను కలుపుతూ రైలుమార్గం వేస్తున్నట్లు ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ ప్రకటించాడు.
- ప్రాణహిత-చేవెళ్ళ ప్రాజెక్టుకు సంబంధించిన 4 ప్యాకేజీలకు, దేవాదుల ఎత్తిపోతల పథకంలో ఒక ప్యాకేజీకి సంబంధించిన టెండర్లు రద్దుచేయాలని నీటిపారుదలశాఖ నిర్ణయించారు.
జూలై 3
[మార్చు]- పాకిస్తాన్లో జరిగుతున్న ఆసియాకప్ క్రికెట్ టోర్నమెంటులో భారత జట్టు ఫైనల్లోకి ప్రవేశించింది.
జూలై 4
[మార్చు]- భారత్‌లో పలు కేసులలో నిందితుడుగా ఉన్న అంతర్జాతీయ నేరగాడు నరేంద్రకుమార్ రస్తోగిని అమెరికా భారత్‌కు అప్పగించింది.
- అమలాపురం మాజీ లోక్‌సభ సభ్యుడు కె.ఎస్.ఆర్.మూర్తి కామ్గ్రెస్ పార్టీకి రాజీనామా.
- ప్రపంచంలో 20మంది మహామేధావుల జాబితాలో అమెరికాలో నివసిస్తున్న ఇద్దరు భారతీయులకు (అమర్త్యాసేన్, పరీద్ జకారియా) చోటుదక్కింది.
- అంతర్జాతీయ బ్యాడ్మింటన్ ర్యాంకింగ్‌లో సైనా నెహ్వాల్ 18వ ర్యాంకును సాధించింది.
- 2009లో ఇంగ్లాండులో నిర్వహించే ట్వంటీ-20 ప్రపంచ కప్ క్రికెట్‌నుంచి జింబాబ్వే జట్టు టోర్నమెంటు నుంచి తప్పుకుంది.
జూలై 5
[మార్చు]- కర్నూలు జిల్లాకు చెందిన భూమా నాగిరెడ్డి, శోభానాగిరెడ్డి దంపతులు తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు.
- వీనస్ విలియమ్స్ వింబుల్డన్ మహిళల సింగిల్స్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. ఫైనల్లో సోదరి సెరెనా విలియమ్స్‌ను వరుస సెట్లలో ఓడించింది.
జూలై 6
[మార్చు]- అణుఒప్పందంపై కేంద్రప్రభుత్వం వామపక్షాల హెచ్చరికను కాదని ముందుకు వెళ్ళడానికే నిర్ణయించింది.
- మన్మోహన్ సింగ్ ప్రభుత్వానికి మంద్దతు ఇవ్వడానికి ములాయంసింగ్ యాదవ్ సంసిద్ధత వ్యక్తం చేశాడు.
- లండన్‌లో జరిగిన వింబుల్డన్ టెన్నిస్ సింగిల్స్ టైటిల్‌ను రాఫెల్ నాదల్ కైవసం చేసుకున్నాడు. ఉత్కంఠతో జరిగిన ఫైనల్ పోరులో 5సార్లు విజేత అయిన రోజర్ ఫెడరర్‌ను 6-4, 6-4, 6-7, 6-7, 9-7 స్కోరుతో ఓడించాడు.
- కరాచిలో జరిగిన ఆసియా కప్ క్రికెట్ ఫైనల్లో శ్రీలంక జట్టు 100 పరుగుల తేడాతో భారత జట్టును ఓడించి కప్ గెలుచుకుంది.
జూలై 7
[మార్చు]- జమ్ము కాశ్మీర్ ముఖ్యమంత్రి గులాం నబీ ఆజాద్ పదవికి రాజానామా చేశాడు.
- ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తొమ్మిదవ వేతన సవరణ సంఘం చైర్మెన్‌గా చల్లపల్లి సత్యనారాయణ నియమితులయ్యాడు.
- యూరప్ ఖండంలోని గన్సీ దేశానికి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ సహసభ్యదేశ హోదా లభించింది. దీనితో ఐసిసి సహసభ్యదేశాల సంఖ్య 32కి చేరింది.
- వింబుల్డన్ ఓపెన్ టెన్నిస్ మిక్స్డ్ డబుల్స్‌లో బాబ్ బ్రయాన్, సమంతా స్తుసుర్ జోడి విజయం సాధించింది.
జూలై 8
[మార్చు]- మన్మోహన్ సింగ్ నాయకత్వంలోని యుపీఏ ప్రభుత్వానికి వామపక్షాలు మద్దతును ఉపసంహరించుకున్నాయి.
- 4 రాష్ట్రాలకు కొత్త గవర్నర్లు నియమించబడ్డారు. హిమాచల్ ప్రదేశ్ గవర్నర్‌గా ప్రభారావు, మణిపూర్ గవర్నర్‌గా గురుబచన్‌సింగ్ జగత్, గోవా గవర్నర్‌గా శివేందర్‌సింగ్ సిద్ధూ, మహారాష్ట్ర గవర్నర్‌గా ఎస్.సి.జమీర్ లుగా వ్యవహరిస్తారు.
- రాష్ట్రంలో కొత్తగా 21 డిగ్రీకళాశాల ఏర్పాటుకు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వు జారీచేసింది.
- కృష్ణా జిల్లా మైలవరం శాసనసభ్యుడు చనుమోలు వెంకట్రావు మృతిచెందాడు.
- కల్కా-సిమ్లా రైలుమార్గం ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడింది.
జూలై 9
[మార్చు]- ఇరాన్ 2000 కిలోమీటర్ల పరిధి కల అత్యాధునిక ఖండాంతర క్షిపణి షహబ్-3 ప్రయోగించింది.
- ఝార్ఖండ్‌లో జనతాదళ్ (యు) శాసనసభ్యుడు రమేశ్ సింగ్ ముండాను కాల్చివేశారు.
- కేంద్రంలోని యుపిఏ ప్రభుత్వానికి మద్దతుగా సమాజ్‌వాది పార్టీ రాష్ట్రపతికి లేఖను సమర్పించింది.
జూలై 10
[మార్చు]- సల్మాన్ రష్డీ రచించిన ప్రముఖ నవల "మిడ్నైట్ చిల్డ్రెన్స్" బెస్ట్ ఆఫ్ ది బుకర్ పురస్కారాన్ని గెలుచుకుంది.
- జమ్ము కాశ్మీర్లో గవర్నర్ పాలన విధించబడింది.
- ప్రపంచ యువ చాంపియన్‌షిప్ ఫైనల్స్‌కు చేరిన తొలి భారతీయ స్విమ్మర్‌గా విర్థావల్ ఖడే రికార్డు సృష్టించాడు.
- థాయిలాండ్‌లో అత్యంత సంపన్నులైన జాబితాలో భారతీయ సంతతికి చెందిన మహిళ నిషితా షా 18వ స్థానం పొందినది.
జూలై 11
[మార్చు]- తెలుగుదేశం పార్టీ నుంచి బయటకు వచ్చిన మాజీ మంత్రి దేవేందర్ గౌడ్ నవ తెలంగాణ ప్రజా పార్టీ పేరుతో కొత్త రాజకీయ పార్టీ స్థాపించాడు.
- భారత ద్రవ్యోల్బణం రేటు 0.26% పెరిగి 11.89%కి చేరింది.
జూలై 12
[మార్చు]- మాజీ విదేశాంగ మంత్రి నట్వర్‌సింగ్ కుమారుడు జగత్సింగ్ బహుజన్ సమాజ్ పార్టీలో చేరినాడు.