[go: up one dir, main page]
More Web Proxy on the site http://driver.im/Jump to content

జామ

వికీపీడియా నుండి

జామ
జామ కాయ
Scientific classification
Kingdom:
Division:
Class:
Subclass:
Order:
Family:
Subfamily:
Tribe:
Genus:
సిడియమ్

Species

About 100, see text

Synonyms

Calyptropsidium O.Berg
Corynemyrtus (Kiaersk.) Mattos
Guajava Mill.
Mitropsidium Burret[1]

జామ లేదా జామి (ఆంగ్లం Guava) మిర్టేసి కుటుంబానికి చెందిన పండ్ల చెట్టు. భారతదేశంలో ఒక సాధారణమైన ఇంట్లో పెరిగే చెట్టు. దీనిని తియ్యని పండ్లకోసం పెంచుతారు. జామ పండ్లలో కొన్ని తెల్లగా ఉంటాయి. కొన్ని ఎర్రగా ఉంటాయి.

జామ మొక్కలు మిర్టిల్‌ కుటుంబానికి చెందిన సిడియం కోవకు చెందిన మొక్కలు. శీతోష్ణస్థితి బట్టి 100 వేర్వేరు రకాలుగా లభ్యమవుతున్నాయి. ఇవి మెక్సికో, మధ్య, దక్షిణ అమెరికాలకు జాతీయ మైనవి. జామపండు, 4 సెం.మీ నుండి 12 సెం.మీ పొడవు ఉండి చూడడానికి ఏపిల్‌ పండులాగాని, బేరి పండులాగ గాని ఉంటుంది. లోపలి కండ తెలుపు, ఎరుపు లేదా గులాబీవర్ణం కలిగి తియ్యగా ఉండి కమ్మని వాసనతో దృఢమైన పచ్చని పై తొడుగు కలిగి ఉంటుంది. స్ట్రా బెర్రీ జామ (పి. కాటిల్‌ యానమ్‌) బ్రెజిల్‌ దేశంలో పుట్టి, ఎర్రని పళ్లు కలిగి ఉంటుంది. ఈ పళ్లు పై పొర గరకుగా లోపలి గుజ్జు ఎర్రగా, రుచికి స్ట్రాబెర్రీ లాగ ఉంటాయి. ఈ పండు ఒక విలక్షణమైన సువాసనతో నిమ్మకంటే కొంచెం తక్కువ ఘాటుగా కలిగి ఉంటుంది. జామపండు లోపలి గుజ్జు తియ్యగా లేక పుల్లగా ఉండి తెలుపు నుంచి ముదురు గులాబీ వర్ణం కలిగి ఉంటుంది. లోపలి గింజలు గట్టిగా ఉండి, పండుకూ పండుకు వాటి సంఖ్య మారుతూ ఉంటుంది.

పెక్టిన్‌ నిల్వలు పైన తొడుగులో ఎక్కువగా ఉండటం చేత ఉడికించిన జామను కాండీలు (అమెరికాలోని స్వీట్స్‌) జాములు, నారింజతో చేసే జాములు, రసాల తయా రీలో ఉపయోగిస్తారు. టొమాటోలకు బదులు గా, ఎర్రజామ ఉప్పుతో చేసే ఉత్పత్తులలో ఉపయోగిస్తారు. జామ పళ్ల నుంచి, ఆకులనుంచి 'టీ' కూడా తయారు చేస్తారు. పోషకవిలువలు జామపళ్లను 'మేలైన ఫలాలుగా' పేర్కొనవచ్చు. ఎందుకంటే వీటిలో విటమిన్‌ 'ఏ', విటమిన్‌ 'సి' నిల్వలు అధికంగా ఉంటాయి. వీటి గింజలు కూడా ఒమేగా-3, ఒమేగా-6 కరుగని కొవ్వు ఆవ్లూలు, పీచు పదార్థాలు ఎక్కవగా కలిగి ఉంటాయి. ఒక జామపండులో విటమిన్‌ 'సి' నిల్వలు ఒక నారింజపండులో కన్నా నాలుగురెట్లు అధికంగా ఉంటాయి. వీటిలో మిన రల్స్‌, పొటాషియం, మెగ్నీషియం నిల్వలు అధిక మొత్తాలలో ఉండి సాధారణంగా అవసర మైన పోషకాలు తక్కువ కేలరీలలో ఉంటాయి. జామపళ్లలో ఉండే కెరటోనాయిడ్లు, పొలీఫెనాల్స్‌- ఇవి ఆక్షీకరణం కాని సహజరంగు కలిగించే గుణాలు ఈ పళ్లకి ఎక్కువ ఏంటీ ఆక్సిడెంట్‌ లక్షణాలను కలుగజేస్తాయి. ఔషధపరమైన ఉపయోగాలు నాటు వైద్యంలో 1950 సంవత్సరం నుంచి జామ ఆకులు వాటిలోని విభాగాలు, ఔషధ లక్షణాలు పరిశోధ నలలో అంశంగా ఉన్నాయి. జామ ఆకులు, బెరడు నుంచి తయారు చేసిన పదార్థాలు కేన్సర్‌, బాక్టీరియా ద్వారా వచ్చే అంటు వ్యాధులు, వాపులు, నొప్పి నివారణలో వైద్యంగా వాడుతున్నారు. ఈ జామాకుల నుంచి తయారు చేసిన నూనెలు కేర్సర్‌లు విరుద్ధంగా పనిచేస్తున్నాయి. ఈ జామ ఆకులను నాటు వైద్యంగా డయేరియాకి మందుగా ఉపయోగిస్తారు. బెరడు ఏంటీ మైక్రోబియల్‌, ఏస్ట్రింజంట్‌ లక్షణాన్ని కలిగి ఉంటుంది. వీటిని చక్కెర వ్యాధి తగ్గించడంలో కూడా ఉపయోగిస్తారు. కొన్ని దేశాల్లో జామ పండు పై తొక్క తొలగించి పంచదార పాకం పట్టి ఎరుపు రంగు కలిపి రెడ్ గోవా అనే పేరుతో విక్రయిస్తారు.

ఆహార విలువ--జామ తినే భాగం 100 గ్రా.లలో

[మార్చు]

కాలరీలు 36-50 తేమ 77-86 గ్రా పీచు 2.8-5.5. గ్రా ప్రొటీన్స్‌ 0.9-1.0 గ్రా క్రొవ్వు 0.1-0.5 గ్రా యాష్‌ 0.43-0.7 గ్రా కార్బోహైడ్రేట్లు 9.5-10 గ్రా కాల్షియం 9.1-17 గ్రా పాస్ఫరస్‌ 17.8.30 మి.గ్రా ఐరన్‌ 0.30-70 మి.గ్రా కెరోటీన్‌ (విటమన్‌ 'ఏ') 200-400 ఎస్కార్బిక్‌ ఆవ్లుము (విటమిన్‌ 'సి') 200-400 మి.గ్రా. ధియామిన్‌ (విటమిన్‌ బి1) 0.046 మి.గ్రా రిబోప్లేవిన్‌ (విటమిన్‌ బి2) 0.03-0.04 మి.గ్రా నియాసిన్‌ (విటమిన్‌ బి3) 0.6-1.068 మి.గ్రా

ఉపయోగాలు :

[మార్చు]

వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది . శక్తివంతమైన యాంటి ఆక్షిడేంట్ గా ఉపయోగపడుతుంది, కణజాలము పొరను రక్షిస్తుంది, కొలెస్టిరాల్ ను తగ్గిస్తుంది,

జామ ఏడాది పొడవునా అడపాదడపా లభిస్తున్నా శీతాకాలం లోనే వీటి రుచి బలే గమ్మత్తుగా ఉంటుంది . ప్రపంచంలో అన్ని దేశాలలోను లభిస్తుంది . . ఆసియా దేశాలలో విసృఉతంగా పండుతుంది . కమలా పండులో కంటే ఇదు రెట్లు అధికంగా విటమిను " సి " ఉంటుంది . ఆకుకూరలలో లభించే పీచు కంటే రెండింతలు పీచు జామకాయలో ఉంటుంది . చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమయ్యే " కొల్లాజన్ " ఉత్పత్తికి ఇది కీలకము, కొవ్వు మెటబాలిజాన్ని ప్రభావితం జేసే " పెక్టిన్" జామలో లభిస్తుంది . ఇది కొలెస్ట్రాల్ ను తగ్గించి, పేగుల్లో ప్రోటీన్ పరిశుభ్రతను పరిరక్షించడంలో సహకరిస్తుంది . జామలో కొవ్వు, క్యాలరీలు తక్కువగా ఉంటాయి కావున బరువు తగ్గాలనుకునే వారికి ఇది మంచి పండు . జామకాయలో పోషకాలు, విటమిన్లు, పీచు పదార్థం వంటి గుణాల వల్ల చక్కెర వ్యాధిగ్రస్తులు సైతం ఆరగించవచ్చు. నీటిలో కరిగే బి. సి. విటమిన్లు, కొవ్వులో కరిగే విటమిన్ ఎ జామకాయలో ముఖ్యంగా లభించే పోషకాలు. ఇక జామపండు పై చర్మంలో విటమిన్ సి అత్యధికంగా ఉంటుంది.

జామకాయలో ఉండే పీచు పదార్థం వల్ల మలబద్ధకం నివారించబడుతుంది. బొప్పాయి, ఆపిల్, నేరేడు పండు కంటే జామకాయలోనే పీచు పదార్థం ఎక్కువగా ఉండటంతో ఇది సుగర్ వ్యాధికి చక్కటి ఔషధం .

అలాగే జామ ఆకులను నమలడం వల్ల పంటి నొప్పులు తగ్గడమే కాక ఆకలి కూడా పెరుగుతుంది. పైగా కొన్ని రకాల వ్యాధుల బారిన పడి ఆకలి మందగించిపోయిన వారికి ఇది ఆకలి పుట్టించగలదు.

లక్షణాలు

[మార్చు]
  • మధ్యరకంగా పెరిగే వృక్షం.
  • దీర్ఘవృత్తాకారంలో ఉన్న సరళపత్రాలు.
  • గ్రీవాలలో 1-3 సంఖ్యలో అమరిన తెలుపురంగు పుష్పాలు.
  • గుండ్రంగా ఉన్న ఆకుపచ్చని మృదుఫలాలు.

పోషక విలువలు

[మార్చు]

పోషక విలువలు ప్రతి వంద గ్రాములకు నీరు: 81.7 గ్రా: కొవ్వు. 0.3 గ్రా. ప్రోటీన్ 0.9 గ్రా పీచు పదార్తాలు: 5.2 గ్రా. సి.విటమిన్ 212 మి.గ్రా. పాస్పరస్. 28 మి.గ్రా సోడియం 5.5 మి.గ్రా పొటాసియం: 91 మి.గ్రా. కాల్సియం: 10 మి.గ్రా ఇనుము; 0.27 మి.గ్రా. శక్తి: 51 కిలో కాలరిలు.

ఇవీ చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. "Psidium". Germplasm Resources Information Network. United States Department of Agriculture. 2009-01-27. Archived from the original on 2009-01-14. Retrieved 2010-03-03.
"https://te.wikipedia.org/w/index.php?title=జామ&oldid=4222239" నుండి వెలికితీశారు